Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు

- Advertisement -

టీడీపీ అధినేత,చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై ఇప్పటికే జైలు అధికారులు స్పందించగా తాజాగా వైద్యులు సైతం వివరాలు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు యాక్టివ్‌గా ఉన్నారని తెలిపిన డాక్టర్లు..ఆయన బరువు 67 కేజీలని వెల్లడించారు. దీంతో బాబు 5 కిలోల బరువు తగ్గారని ఇప్పటికి ప్రచారం చేస్తున్న టీడీపీ శ్రేణులకు గట్టి షాక్‌ తగిలింది.

చంద్రబాబుకు ఎలాంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని…పుకార్లు నమ్మవద్దని వెల్లడించారు. చంద్రబాబు పర్సనల్ డాక్టర్లను సంప్రదించిన తరువాతే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చామని…ఆయన ఆరోగ్యం పట్ల ఎక్కడా అశ్రద్ధ చేయలేదన్నారు.

డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును జైలు అధికారులు పాటిస్తారని… చెమట కారణంగా దురద వస్తుందని, రాషెస్ ఎవరికైనా వస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎవరికైనా డీ హైడ్రేషన్ రావడం ఖాయమన్నారు.

ఏదిఏమైనా చంద్రబాబు ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పడగా ఇకనైనా టీడీపీ నేతలు సింపతి పాలిటిక్స్‌కు పుల్ స్టాప్ పెడతారో లేదో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -