Monday, May 20, 2024
- Advertisement -

టీకాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్..రేవంత్ కీలక అనుచరుడు రాజీనామా!

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల వేళ కీలకంగా మారుదామని అనుకున్న రేవంత్ అండ్ కో కి జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ రాజీనామా చేయగా మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఇదే బాటలో రేవంత్ కీలక అనుచరుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

రేపు సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనుండగా ఇది నిజంగా రేవంత్‌కు ఇబ్బందికర పరిస్థితే. ఉప్పల్ టికెట్ ఆశించి కొంతకాలంగా స్ధానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థులను ఇంకా ప్రకటించకముందే కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇక రేపో మాపో ఫస్ట్ లిస్ట్ వస్తే మరికొంతమంది సీనియర్లు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌కు ఊపు వస్తుంది అనుకుంటున్న తరుణంలో కీలక నేతలు పార్టీని వీడుతుండటంత హస్తం పార్టీకి గట్టి దెబ్బే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -