Monday, April 29, 2024
- Advertisement -

భారత్ హ్యాట్రిక్…పాక్ చిత్తు

- Advertisement -

దాయాదుల పోరులో భారత్ మరోసారి గెలిచింది. వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు పాకిస్ధాన్ పై ఓటమి ఎరుగని భారత్ ఆ రికార్డును పదిలంగా ఉంచుకుంది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసింది భారత్. ఉత్కంఠ భరితంగా ఈ మ్యాచ్ సాగుతుందని అంతా భావించినా ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

పాకిస్ధాన్ విధించిన 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 30.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. రోహిత్ శ‌ర్మ 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో కేవలం 63 బంతుల్లోనే 86 పరగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (53) నాటౌట్‌ రాణించగా గిల్ (16), విరాట్ కోహ్లీ (16) పరుగులు చేశారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన భారత్…పాకిస్ధాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే తొలుత ధాటిగా ఆడిన తర్వాత పాకిస్థాన్ తడబడింది. 42.5 ఓవ‌ర్ల‌లో 191 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. బాబ‌ర్ ఆజాం (50),మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36), అబ్దుల్లా షఫీక్ (20) పరుగులతో రాణించారు. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -