Saturday, May 3, 2025
- Advertisement -

కర్ణాటక ముడా స్కామ్‌…అప్‌డేట్!

- Advertisement -

కర్ణాటకు ముడా స్కామ్ కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా సీఎం సిద్దరామయ్య మెడకు ముడా స్కామ్ చుట్టుకోగా ఈ స్కామ్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. క‌డూరు, ముడిగేరి తాలూకాల్లో సుమారు ప‌ది వేల ఎక‌రాల స్థ‌లాన్ని అక్ర‌మంగా కేటాయించగా దర్యాప్తు సంస్థల రిపోర్టు ప్రకారం.. ఆరుగురు మాజీ ఎమ్మెల్యేల‌కు స్థలాన్ని కేటాయించిన‌ట్లు తెలిసింది.

అలాగే మరో 326 మంది అధికారులు కూడా భూమి తీసుకున్న‌వారిలో ఉన్నారని విచారణ తేలింది. అక్ర‌మ కేటాయింపుల‌కు రెగ్యుల‌రైజేష‌న్ క‌మిటీ బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని రిపోర్టులో పేర్కొంది.

అక్రమంగా భూమిని పొందిన వారిలో చిక్క‌మంగుళూరుకు చెందిన సీటీ ర‌వి , 326 మంది అధికారుల్లో.. 23 మంది త‌హిసిల్దారులు, 18 షిర‌స్తేదార్లు, 48 మంది రెవ‌న్యూ ఇన్‌స్పెక్ట‌ర్లు, 104 మంది విలేజ్ ఆఫీస‌ర్లు ఉన్నారు. మొత్తం 10,598 ఎక‌రాల భూమిని అక్ర‌మంగా కేటాయించిన‌ట్లు రిపోర్టులో పేర్కొనగా ఇందులో 6248 ఎక‌రాల స్థ‌లాన్ని అన‌ర్హులకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ అంశం మరింత హీట్ పెంచే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -