Thursday, March 28, 2024
- Advertisement -

భిక్షాటనను.. నిషేదించిన గవర్నమెంట్ ?

- Advertisement -

ఒక్క పూట అన్నం కోసం ఆత్మాభిమానం చంపుకొని భిక్షామెత్తుకునే వారిని మనం రోజు చూస్తూనే ఉంటాం. అయితే వికలాంగులుగా ఉండి, ఏ పని చేయలేక కటిక పేదరికంలో ఉన్నవారు భిక్షామెత్తుకోవడంలో అర్థముంది కానీ వికలాంగులుగా నటిస్తూ అడుక్కోవడాన్నే ప్రధాన వృత్తిగా ఎంచుకున్న కొన్ని దొంగ ముఠాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి ముఠాలు సామాన్యుల వద్ద భిక్షామెత్తి లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశం మొత్తం మీద ఇలాంటి ముఠాలు కొన్ని గ్రూపులుగా ఏర్పడి ఈ ఆడుక్కునే దందాను కొనసాగిస్తున్నాయి.

అయితే నిజమైన భిక్షకులకు, నకిలీ భిక్షకులకు తేడా తెలియకపోవడం వల్ల ఈ అడుక్కునే దందాపై ఏ ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కానీ కర్నాటక గవర్నమెంట్ ఈ దొంగ భిక్షకుల ఆట కట్టించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో అడుక్కోవాడాన్ని పూర్తికాగా నిషేదిస్తూ.. సరికొత్త విధానాలను అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోట శ్రీనివాసపూజరి ఇటీవల ప్రకటించారు. కొన్ని ముఠాలు పిల్లలను దివ్యాంగులుగా మార్చి భిక్షాటన చేయిస్తున్నారని, అందువల్ల బాలనేరస్తులు పెరిగిపోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

అందువల్లే రాష్ట్రంలో పూర్తిగా భిక్షాటన చెయ్యడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుదని తెలిపారు. దీంతో కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్నీ వైపులా నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఇదే విధానాన్ని అన్నీ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా భిక్షాటన పేరుతో ప్రజలను నిలువున దోచుకుంటున్నాయి ఈ దొంగ ముఠాలు.. ఇలాంటి వాటిని అరికట్టాలంటే ప్రభుత్వాలు చోరువ చూపినప్పుడే సాధ్యమవుతుంది. ఒక్క కర్ణాటకనే కాకుండా అన్నీ రాష్ట్రాలు కూడా ఈ భిక్షాటన ను బ్యాన్ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నప్పుడే.. భిక్షాటన పేరుతో ప్రజలను మోసం చేసే వారి సంఖ్య తగ్గుతుంది.

More Like This

ఇండియాను విడిచిపెడుతున్న భారతీయులు !

కష్టాల్లో నెట్ ఫ్లిక్స్ ..గట్టెక్కేనా ?

సంక్షోభం గుప్పెట్లో.. మరికొన్ని దేశాలు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -