Sunday, April 28, 2024
- Advertisement -

ఎమ్మెల్యేలు జర జాగ్రత్త..కొడుతుండ్రూ!

- Advertisement -

ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి తీర ఎన్నికల్లో గెలిచిన తరువాత.. హామీలను నెరవేర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రజలు తిరిగి ఎన్నికలు వచ్చినప్పుడు ఓటుతో సమాధానం చెబుతూ ఉంటారు. అయితే కొన్ని సంబర్భాలలో ప్రజా ప్రతినిధులపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో నాయకులను కొట్టడానికైనా వెనుకాడరు ప్రజలు. ఇలాంటి ఘటనే ఇటీవల కర్నాటకలో చోటు చేసుకుంది. కర్నాటకలోని చికమగులూరు గ్రామంలో ఇటీవల ఏనుగుల దాడి పెరిగిపోవడంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

అయితే అధికారులు సరైన చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో ఏనుగుల దాడిలో ఓ మహిళా కూడా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇక ఆలస్యంగా ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఏనుగులు భీభత్సం సృస్తించిన గ్రామంలో పర్యటించారు. అయితే అప్పటికే ప్రభుత్వ యంత్రాంగం పై ఆగ్రహంగా ఉన్న గ్రామస్తులు.. ఆ ఎమ్మెల్యేపై భౌతిక దాడికి పాల్పడ్డారు. దాంతో గ్రామస్తుల నుంచి తప్పించుకునేందుకు ఆ ఎమ్మెల్యే వెంటనే తన కారులో అక్కడి నుంచి పరారు అయ్యారు. ఇదిలా ఉంచితే ఎమ్మెల్యేలను కొట్టిన ఘటన మరో చోట కూడా చోటు చేసుకుంది. డిల్లీ లోని ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన గులాబ్ సింగ్ పై సొంత పార్టీ కార్యకర్తలే ఇటీవల దాడికి పాల్పడ్డారు.

మున్సిపల్ ఎన్నికల టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నేతలనుంచే తిరుగుబాటు ఎదురైంది. ఫలితంగా కార్యకర్తలు ఆయనపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలా ఈ రెండు మూడు ఘటనలే కాకుండా ప్రజలు ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేస్తున్న సంబర్బలు అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నామని తాము ఏం చేసిన చెల్లుతుందని ఎమ్మేల్యేలు భావిస్తే అప్పుడప్పుడు ప్రజల నుంచి ఇలాంటి ఘటనలు చేటు చేసుకోవడం ఖాయం.. ఎమ్మేల్యేలు జర భద్రం !

ఇవి కూడా చదవండి

బాబు సెంటిమెంట్ అస్త్రం.. కొంపముంచుతోందా ?

జనసేన కాదు రౌడీసేననే : అంబటి!

చంద్రబాబు బెదిరిస్తున్నారు .. జగన్ హాట్ కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -