Tuesday, May 6, 2025
- Advertisement -

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో కొత్త టెన్షన్‌!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. పల్లె పల్లెల్లో ప్రధాన పార్టీల ప్రచార హోరుతో ఎన్నికల క్షేత్రం కాస్త రణరంగంగా మారింది. ఇక ఇప్పటివరకు అసమ్మతి నేతలతో టెన్షన్ పడుతున్న పార్టీలకు ఇప్పుడు మరో పార్టీతో గుబులు మొదలైంది. అదే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ప్రధాన పార్టీల నుండి టికెట్లు రాని నేతలు ఫ్వార్వార్డ్ బ్లాక్ నుండి బరిలో నిలిచారు.

ఈ పార్టీ నుండి 47 మంది బరిలో నిలవగా చివర్లో ఐదుగురు డ్రాప్ కావడంతో 42 మంది బరిలో నిలిచారు. అయితే ఎన్నికల సరళిని గమనిస్తే 12 స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు ఫ్వార్వర్డ్ బ్లాక్ నేతలు. కొత్తగూడెం,గద్వాల, షాద్ నగర్,నల్గొండ,హుజుర్‌ నగర్,కోరుట్ల,ముథోల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రధాన పార్టీల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఇక ప్రధానంగా కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని బరిలో ఉండగా సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్ మధ్య మాటల యుద్ధం నెలకొంది.

ఈసారి తెలంగాణ అసెంబ్లీలో ఫార్వర్డ్ బ్లాక్ ఎమ్మెల్యే ఉండి తీరుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రధాన పార్టీల నేతలు ఫార్వార్డ్ బ్లాక్ గుర్తు సింహం అంటేనే వణికిపోతున్నారు. 2018 ఎన్నికల్లో ఫార్వార్డ్ బ్లాక్ రామగుండం అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోగా భూపాలపల్లిలో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి రెబల్స్ రూపంలో బలమైన అభ్యర్థులు ఉండటంతో ఎవరి గెలుపు, ఓటములపై ప్రభావం చూపుతుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -