Friday, May 3, 2024
- Advertisement -

మెదక్ పార్లమెంట్..గులాబీ వికసించేనా?

- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మెదక్ పార్లమెంట్ స్ధానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గులాబీ కంచుకోటగా మెదక్ నుండి బీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కంచుకోట మెదక్. కానీ ఈసారి ఆసక్తికర పోరు జరుగుతోంది. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తలపడుతుండగా బీజేపీ నుండి రఘునందన్ రావు,కాంగ్రెస్ నుండి నీలం మధు బరిలో నిలిచారు.

1980లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ నియోజకవర్గం నుండి గెలుపొందగా మాజీ సీఎం కేసీఆర్ సైతం మెదక్‌ ఎంపీగా గెలుపొందారు. 1952లో ఏర్పడిన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడగా 9 సార్లు కాంగ్రెస్‌ గెలుపొందగా 2004 నుండి బీఆర్ఎస్‌కు తిరుగులేదు.

మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల ఓటర్లు ఉండగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటానుచెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా ఒక స్థానం మెదక్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య పోరు జరగనుండగా విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆపరేషన్‌ ఆకర్ష్‌తో పెద్ద ఎత్తున బిజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలను చేర్చుకుంటు ఆ బలంపైనే కాంగ్రెస్ ఆధారపడగా తమ కంచుకోటను నిలుపుకోవాలని భావిస్తోంది బీఆర్ఎస్. మరోసారి మెదక్‌ సీటును గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. వెంకట్రామిరెడ్డి గెలుపు బాధ్యతను తీసుకున్నారు హరీష్. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సైతం గట్టి పోటీ ఇస్తుండగా గెలుపు ఎవరిని వరిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -