మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన ఒక మగబిడ్డకు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు చిరంజీవి వెల్లడించారు. తల్లి, పిల్లలు ముగ్గురూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు.
ఈ ఆనందకరమైన వార్తతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసనలకు కుమార్తె క్లిన్ కారా ఉండగా, ఇప్పుడు కవలల రాకతో వారి కుటుంబం మరింత పరిపూర్ణమైంది. మెగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువలా పంపుతున్నారు.
చిరంజీవి తన సందేశంలో దేవుడి ఆశీస్సులతో ఈ సంతోషకర ఘట్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసనలకు, అలాగే మెగా కుటుంబానికి అభిమానులు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు.
