- Advertisement -

నిపా వైరస్ వ్యాప్తి..లక్షణాలివే!

- Advertisement -

భారతదేశంలో కొత్త నిపా వైరస్ కేసులు నిర్ధారణ కావడంతో ఆసియా ఖండంలోని పలు ప్రాంతాల్లో ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో రెండు కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో థాయిలాండ్, సింగపూర్, హాంకాంగ్, మలేసియా వంటి దేశాలు అదనపు స్క్రీనింగ్, పరీక్షా విధానాలను అమలు చేస్తున్నాయి. అరుదుగా కనిపించినా, తీవ్రమైన ప్రభావాలు చూపే వైరస్ కావడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వైద్యుల మాటల్లో చెప్పాలంటే, నిపా వ్యాప్తి సాధారణంగా పరిమితంగానే ఉంటుంది. అయినప్పటికీ అప్రమత్తత అత్యవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఈ వైరస్ మరణాల రేటు 40 శాతం నుంచి 75 శాతం వరకు ఉండొచ్చు. వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే అవకాశమున్నా, అది సులభంగా జరగదు. అందుకే ప్రారంభ దశలోనే గుర్తించి, ఐసోలేషన్ చేయడం చాలా ముఖ్యం.

నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధి . ఇది కోవిడ్-19, ఈబోలా వంటి తీవ్రమైన వైరస్‌ల స్థాయిలో ప్రమాదకరమని చెప్పారు. ప్రధానంగా ఈ వైరస్ ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన పండ్లు లేదా వాటితో తయారైన పదార్థాలను తినడం ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. ఫ్రూట్ బ్యాట్స్ మూత్రం లేదా లాలాజలం కలిసిన పండ్లు, ముఖ్యంగా పచ్చి ఖర్జూర రసం తాగడం ప్రధాన కారణం అని ఆయన తెలిపారు. అలాగే దగ్గరగా మెలిగే వ్యక్తుల మధ్య కూడా ఇది వ్యాపించవచ్చని చెప్పారు. పందులు, కుక్కలు, పిల్లులు, గొర్రెలు, గుర్రాలు వంటి జంతువులకూ ఇది సోకవచ్చు.

నిపా వైరస్‌లో అత్యంత కష్టమైన విషయం దీని ఇన్క్యుబేషన్ పీరియడ్. సాధారణంగా 5 నుంచి 14 రోజులు పడుతుంది. కొన్ని సందర్భాల్లో 45 రోజుల వరకూ లక్షణాలు కనిపించకపోవచ్చు . ఈ సమయంలో వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించి, సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అందువల్ల గుర్తించకుండా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు తొలుత కనిపిస్తాయి. ఇవి సాధారణ జలుబు లేదా ఫ్లూ లక్షణాల్లా ఉండడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. దీని వల్ల వైద్య సహాయం ఆలస్యం అయి, వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.నిపా వైరస్‌కు ప్రత్యేక యాంటీవైరల్ చికిత్స లేదు. లక్షణాలను తొలిదశలోనే గుర్తించడం, కఠినమైన ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యలు పాటించడం అత్యంత కీలకం. వైరస్‌కు గురయ్యే అవకాశం ఉన్న 14 రోజులలో లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వడం, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఐసోలేషన్‌లో ఉండటం, అవసరమైన సహాయక చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -