- Advertisement -

బీఆర్ఎస్‌కి హరీష్ రాజీనామా చేయాలి!

- Advertisement -

బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి . చిట్‌చాట్ కార్యక్రమంలో మాట్లాడుతూ..హరీష్ రావు వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ను మోసం చేసి రాష్ట్రాన్ని, పార్టీని దోచుకున్నాడని కవిత చేస్తున్న ఆరోపణలపై ముందుగా హరీష్ రావు స్పష్టమైన సమాధానం చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు. వాటిపై స్పందించకుండా, సిగ్గులేకుండా ప్రెజెంటేషన్లు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను ఇరికించింది హరీష్ రావేనని ఆరోపించారు. అదే కారణంగా రెండోసారి మంత్రి పదవి ఇవ్వడంలో కూడా ఆలస్యం జరిగిందని చెప్పారు.

ఇంత జరుగుతున్నా హరీష్ రావు మంచోడు అని కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఒక్క మాట కూడా చెప్పకపోవడం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ అంతర్గతంగా అన్నీ తెలిసే ఈ మౌనం పాటిస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు ప్రజల ముందు పూర్తిగా బయటపడుతున్నాయని, ఇకనైనా బాధ్యత తీసుకుని హరీష్ రావు రాజీనామా చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -