Friday, May 9, 2025
- Advertisement -

జంపింగ్ జపాంగ్..ఎవరు ఏ పార్టీలో ఉన్నారు?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల వేళ వలసల పర్వం జోరందుకుంది. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్‌ నుండి బీఆర్ఎస్‌లోకి జోరుగా వలసలు సాగుతుండగా మరికొంతమంది తిరిగి సొంతగూటికే చేరిపోతున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నేతలకే కాదు ప్రజలకు అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇక ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌. అలాగే బీఆర్ఎస్‌లో చేరనున్నారు టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి. మంత్రి హరీష్ రావు సమక్షంలో వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకొనున్నారు.

ఇక ఇందులో విశేషమెంటంటే జిట్టా బాలకృష్ణా రెడ్డి ఇటీవలె బీజేపీ నుండి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే భువనరిగి కాంగ్రెస్ నేత అనిల్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరి తిరిగి తన సొంతగూటికే చేరుకున్నారు. దీంతో హస్తం పార్టీ టికెట్ ఆయనకేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిట్టా..కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నారు జిట్టా. గతంలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీని వీడారు.

రాహుల చంద్రశేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓ సారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2014లో వనపర్తి నుండి పోటీ చేసి ఓడిపోయారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రావుల ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ సైతం తన ఉద్యోగానికి రాజీనామా చేయగా ఆయన కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన బీఆర్ఎస్‌లో చేరికతో పార్టీకి ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు. మొత్తంగా జంపింగ్ జపాంగ్‌లతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -