Sunday, April 28, 2024
- Advertisement -

ట్రెండింగ్…పీకేతో సీఎం కేసీఆర్ మాటమంతి?

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం కీలక దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా 6 రోజులే సమయం ఉండగా ప్రధాన పార్టీల అగ్రనేతలంతా మరింత జోరు పెంచారు. బీఆర్ఎస్ నుండి సీఎం కేసీఆర్,కేటీఆర్,హరీశ్‌ ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నుండి రాహుల్, ప్రియాంక, బీజేపీ నుండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా విస్తృతంగా పర్యటించనున్నారు.

ఇక ఎన్నికలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. ఈ విషయాన్ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గురురాజ్ అంజన్ వెల్లడించారు. #PKmeetsKCR బిగ్గెస్ట్ బ్రేకింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ భేటీ నవంబర్ 20న జరిగిందని సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపారని తెలిపారు.

తెలంగాణలో ఈసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్…ఈ 6 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారని తెలిపారు. ఇక ఇదే సమయంలో కీలక విషయాన్ని వెల్లడించారు గురురాజ్ రంజన్. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రశాంత్…బీజేపీతో కలిసి పనిచేయనున్నారని వెల్లడించారు. 2014లో పీకే…బీజేపీ గెలుపుకోసం పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ప్రశాంత్ చర్చలు జరిపారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -