Saturday, May 18, 2024
- Advertisement -

స్పీకర్ గెలిచాడు..చరిత్ర క్రియేట్ చేశాడు!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించగా ఇక స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో స్పీకర్‌గా ఉండి గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు పోచారం.

ఇంతవరకు స్పీకర్‌గా పనిచేసి గెలిచిన అభ్యర్థి లేరు. ఆ రికార్డును చెరిపేసిన పోచారం…కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో గెలిచి స్పీకర్ బాద్యతలు చేపట్టిన మధుసుదనాచారి 2018 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. అదే సమయంలో ఏపీలో కూడా 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచి స్పీకర్ బాధ్యతలు చేపట్టిన దివంగత నేత కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.

ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిస్టరీని గమనిస్తే జరిగింది ఇదే. స్పీకర్‌గా పనిచేసి తర్వాత రాజకీయ ముఖచిత్రంలో చాలామంది లేకుండా పోయారు. స్పీకర్ పదవిని చేపట్టాలంటే అదో పీడ అని భావించే పరిస్థితి నెలకొనగా బి‌ఆర్‌ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి బ్రేక్ చేశారు. భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు బ్రేక్ చేశారు. తెలంగాణలో పోచారం రికార్డ్ బ్రేక్ చేయగా ఏపీలో ఎన్నికల్లో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -