న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు భారత బౌలర్లు రాణించారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు.
అశ్విన్ తొలి మూడు వికెట్లు పడగొట్టగా.. మిగిలిన ఏడు వికెట్లను వాషింగ్టన్ సుందర్ తీశాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లలో డేవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలతో రాణించగా మిచెల్ శాంట్నర్ (33) ,టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18), డారిల్ మిచెల్ (18), గ్లెన్ ఫిలిఫ్స్ (9) పరుగులు చేశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. టిమ్ సౌథీ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ కాగా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు జైస్వాల్, గిల్. యశస్వి జైస్వాల్ (6), శుభ్‌మన్ గిల్ (10) లు క్రీజులో ఉన్నారు.