టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రిటైర్‌మెంట్ టైం వచ్చిందా…?అధికార వైసీపీ నేతలు పదేపదే ఆయన వయస్సు?అనారోగ్య సమస్యలను ఎందుకు ప్రస్తావిస్తున్నారు..?ఇంతకి చంద్రబాబు వయసు ప్రస్తావన ద్వారా ఆయనకు రిటైర్‌మెంట్ టైం వచ్చిందని గుర్తు చేయడంలో ఉద్దేశం ఏంటీ? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ఇక చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు..40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. తన రాజకీయ జీవితంలో 2023 మర్చిపోలేని సంవత్సరం. చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన ఈ సంవత్సరం చంద్రబాబునే కాదు టీడీపీ నేతలను ఎప్పటికి వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే కలలో కూడా ఊహించి ఉండరు. తాను జైలుకు వెళ్తానని..అది 52 రోజులు. ఇక జైలు జీవితం తర్వాత చంద్రబాబు పూర్తిగా ఢీలా పడిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓ వైపు కంటి సమస్య మరోవైపు స్కిన్ ప్రాబ్లమ్స్, గుండె సమస్యలు ఇలా ఇప్పుడు చంద్రబాబు పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేళ యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరమైతే తెరవెనుక ఉండి చక్రం తిప్పుతారా లేదా సైలెంట్ అయిపోతారా అన్న దానికి కాలమే సమాధానం చెప్పనుంది. ఇక చంద్రబాబు పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై సీఎం జగన్ సహా మంత్రులు చేస్తున్న కామెంట్స్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్..చంద్రబాబును ముసలాయన అని సంబోధిస్తే మరో మంత్రి ఏకంగా ఆయనకు రిటైర్‌మెంట్ టైం దగ్గర పడిందన్నారు. అన్ని జబ్బులు ఉన్న నాయకుడు ఏపీకి అవసరమా …బాబు ఇక రాజకీయంగా తప్పుకుంటే సో బెటర్ అని చెప్పారు మంత్రి కొట్టు సత్యనారాయణ.పదేపదే చంద్రబాబు వయస్సును ప్రస్తావించి ఆ పార్టీ నేతలను ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా చేయడమే వైసీపీ నేతల టార్గెట్ అని తెలుస్తోంది.ఎందుకంటే చంద్రబాబు లేని టీడీపీని చూడలేం..అలా అని లోకేష్ కి పగ్గాలు అప్పగిస్తే టీడీపీ పరిస్థితి సరాసరే.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే నాయకుడు ఎవరనేది ఆపార్టీలోనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఇంకా బాబు తానే నాయకుడని ముందుకొస్తే అది టీడీపీకి మరింత డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత సరైన డైరెక్షన్ ఇచ్చే వారు లేక టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాయకులు ఎవరికి వారే ఇష్టారీతిన వ్యవహరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరి చంద్రబాబు తెర వెనకుండి రాజకీయాలు నడిపించి పొలిటికల్ రిటైర్ మెంట్ తీసుకుంటారా? లేదా తానే ముందుండి నడిపిస్తారా అన్నదానిపై త్వరలోనే క్లారిటీకి వచ్చే ఛాన్స్ ఉంది.
