Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ స్థానాల్లో బీఆర్ఎస్ బోణి కొట్టేనా?

- Advertisement -

కేసీఆర్ అంటే తెలంగాణ…తెలంగాణ అంటే కేసీఆర్. తెలంగాణ సాధించిన నేతగా, సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా రెండుసార్లు బీఆర్ఎస్‌దే తిరుగులేని అధికారం. ఉత్తర,దక్షిణ తెలంగాణలో పలు స్థానాలు బీఆర్ఎస్‌కు కంచుకోటలుగా మారాయి.

అయితే ఆ 17 స్థానాల్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది బీఆర్ఎస్. మధిర, వైరా, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, పాలేరు, భద్రాచలం,గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గోషామహల్, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, కార్వాన్, ఛార్మినార్, యాకత్ పూర, బహద్దూర్ పుర, నాంపల్లి, రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీ నగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవలేదు. అయితే బీఆర్ఎస్ గెలవక పోయినా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్,ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్‌లో కలిపేసుకున్నారు.

ఇక ఈ సారి పార్టీ మారిన నేతలకే టికెట్లు ఇవ్వడంతో వారిని గెలిపించి బీఆర్ఎస్ గెలవలేకపోయిందనదే అపవాదును చెరిపేయాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. అయితే ఎంఐఎం గెలిచే 6 స్థానాల్లో మాత్రం కారుకే కాదు ఇతర పార్టీలు గెలిచే ఛాన్స్ ఉండదు కాబట్టి ఈ 17లో మెజార్టీ స్థానాల్లో గెలిచేలా వ్యూహాలు రచించారు. అందుకే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకరి తర్వాత ఒకరు ఈ నియోజక వర్గాల్లో పర్యటిస్తూ జోష్ నింపుతున్నారు. మరి గులాబీ బాస్ కోరిక ఈ ఎన్నికలతోనైనా నెరవేరుతుందా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -