Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు దిగ్విజయ్‌ రాజీనామా?

- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేశారా…?మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ ఏం జరుగుతోంది. దిగ్విజయ్ రాజీనామా లేఖ వెనకెవరున్నారారు..?ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రధాన పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ ఆ పార్టీకి రాజీనామా చేశారనే లేఖ వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో దిగ్విజయ్ రాజీనామాకు సంబంధించిన లేఖ వైరల్‌గా మారగా దీనిపై వెంటనే స్పందించారు డిగ్గీ రాజా. తాను పార్టీకి రాజీనామా చేయలేదని, ప్రత్యర్థి పార్టీలు తప్పులు లేఖలు సృష్టించాయని వెల్లడించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించారు.

ఇక ఈ లేఖ వెనుక బీజేపీ హస్తం ఉందని…అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నేతలు నిపుణులు. నేను 1971లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నాను. నేను కాంగ్రెస్‌లో చేరింది పదవి కోసం కాదు, సిద్ధాంతాల కోసమేనని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోండగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -