Monday, May 20, 2024
- Advertisement -

స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు..పక్కా ఆధారాలివే!

- Advertisement -

చంద్రబాబు ప్రోద్బలంతోనే స్కిల్‌ స్కామ్‌ జరిగిందనేది వాస్తవం. దీనినే ఏపీ సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో నిరూపించి ఛార్జీషీట్ సైతం దాఖలు చేశారు. డేట్‌ లేని ఫేక్‌ ఎంవోయూ ఫైల్‌పై చంద్రబాబు 13 సంతకాలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు సైతం లభించాయి. ఇక విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు ఇదే విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఇక ఈ కేసులో సీమెన్స్ నిర్వహించిన అంతర్గత విచారణలో ఏపీఎస్ఎస్‌డీసీ నుంచి నిధులను డిజైన్‌టెక్ ద్వారా ఒక పీవీఎస్‌పీ ఐటీ స్కిల్స్‌కు సబ్‌కాంట్రాక్ట్ ఇచ్చారు.

ఈ క్రమంలో పీవీఎస్‌టీ ఐటీ స్కిల్స్ కంపెనీకి సంబంధించి రూ.8.5 కోట్లకు సంబంధించిన జీఎస్టీ రిసిప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇందులో డబ్బు ఎక్కడి నుండి వచ్చింద అన్న పూర్తి వివరాలు ఉండటంతో చంద్రబాబు స్కాంకు సంబంధించి ఎక్కడో చిన్న అపోహ ఉన్న వారికి సైతం క్లారిటీ వచ్చేసింది.,

ది. ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు 2015లో సీమెన్స్-డిజైన్ టెక్ సంస్థలు అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో రూ.3,300 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం కాగా, మిగతా 90 శాతం భాగస్వామ్య టెక్ సంస్థలు చెల్లించాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం రూ.370 కోట్లు చెల్లించగా, అందులో రూ.241 కోట్లను పలు ఇతర కంపెనీలకు మళ్లించారు. దీనిపై జీఎస్టీ ఇంటెలిజెన్స్, ఐటీ శాఖ విచారణ జరపగా తీగలాగితే డొంక కదిలినట్లు మొత్తం వ్యవహారం భట్టబయలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -