Monday, April 29, 2024
- Advertisement -

బీజేపీలో టీడీపీ విలీనమా?

- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు, టీడీపీ -జనసేన కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో వేడి రాజుకుంటోంది. ఇక చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌లో ఉన్న నెల రోజుల తర్వాత నారా లోకేష్‌కు బీజేపీ పెద్దలను కలిసే అవకాశం వచ్చింది. దీంతో ఇక చంద్రబాబు బయటకు రావడం ఖాయమని అలాగే టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని…స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సాయం చేస్తే టీడీపీని విలీనం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లోకేష్ చెప్పారన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఆరోగ్యంపై వదంతులు సృష్టించి ఆస్పత్రికి తరలించాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ న్యాయస్థానంలోనూ చంద్రబాబుకు రిలీఫ్ రాదని… చల్లటి వాతావరణం కావాలని జైలర్ ను అడిగితే ఏర్పాటు చేయరని, కోర్టు ఆదేశాల మేరకే ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు చాలా కాలం నుండి చర్మసంబంధిత వ్యాధి ఉందని….రాజకీయ లబ్ది పొందేందుకే ఏసీ కావాలని అడగలేదన్నారు. ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పురంధేశ్వరి చేరుతున్నారని ..రాష్ట్రంలో బీజేపీ తన పని తాను చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. మొత్తంగా టీడీపీ – బీజేపీ పొత్తు పొడుస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -