- Advertisement -

RCB..సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?

- Advertisement -

ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ హై-ప్రెజర్ మ్యాచ్‌లో అందరి కళ్లు ఆర్‌సీబీ ప్రధాన పేసర్, ఆస్ట్రేలియా దిగ్గజం జోష్ హాజిల్‌వుడ్‌పైనే ఉన్నాయి. హాజిల్‌వుడ్‌కు టీ20 ఫైనల్స్ మ్యాచ్‌లలో అద్భుతమైన రికార్డు ఉంది. కెరీర్‌లో ఇప్పటివరకు తను ఆడిన ఏ ఒక్క టీ20 ఫైనల్‌లోనూ అతను ఓడిపోలేదు.

జోష్ హాజిల్‌వుడ్ కేవలం టెస్టుల్లోనే కాదు…పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అలాగే ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లు మరియు దేశవాళీ టీ20 లీగ్‌ల ఫైనల్స్‌లో తిరుగులేని రికార్డును కలిగి ఉన్నాడు.

అతను ఆడిన గత నాలుగు ప్రధాన టీ20 ఫైనల్స్ రికార్డులను పరిశీలిస్తే..

2021 ఐపీఎల్ ఫైనల్ (CSK): చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అద్భుత ప్రదర్శన చేసి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు.

2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ (ఆస్ట్రేలియా): న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.

2022 ఐపీఎల్ ఫైనల్ (గుజరాత్ టైటాన్స్): 2022లో గుజరాత్ టైటాన్స్ మొదటిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు హాజిల్‌వుడ్ ఆ జట్టులోనే సభ్యుడిగా ఉన్నాడు.

2024 ఐపీఎల్ ఫైనల్ (ఎస్‌ఆర్‌హెచ్): సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ గతంలోనూ ఫైనల్ విజయాన్ని అందుకున్నాడు.

ఇలా తను ప్రాతినిధ్యం వహించిన జట్లన్నీ ఫైనల్‌కు చేరిన ప్రతిసారీ హాజిల్‌వుడ్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు 2026లో ఆర్‌సీబీ తరఫున మరోసారి ఫైనల్ ఆడుతూ తన రికార్డును కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడం హాజిల్‌వుడ్‌కు అలవాటైన విద్య. పవర్‌ప్లేలో లెంత్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఈ బౌలర్‌ది ప్రత్యేకశైలీ. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్‌లను త్వరగా అవుట్ చేయడానికి ఆర్‌సీబీ కెప్టెన్ ….హాజిల్‌వుడ్‌నే ప్రధాన అస్త్రంగా వాడుకోనున్నాడు. గిల్, సాయి సుదర్శన్ లతో కూడిన జీటీ బ్యాటింగ్ లైనప్ హాజిల్‌వుడ్ పేస్‌ను ఎలా ఎదుర్కొంటుందనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -