- Advertisement -

కన్ఫామ్… ఒంగోలు వారసుడొచ్చేశాడు!

- Advertisement -

ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ కంటే నాలుగు అడుగుల ముందున్న వైసీపీ…కలిసి వచ్చే ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బస్ యాత్ర రూట్ మ్యాప్ ఖరారు కాగా ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోటీచేసే అభ్యర్థులపై ఓ క్లారిటీకి వచ్చేశారు వైసీపీ అధినేత, సీఎం జగన్.

కొంతమంది సిట్టింగ్‌లకు సీట్లు నిరాకరణ అలాగే కొంతమంది వారసులకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు ఎంపీ స్ధానాన్ని ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డికి కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

అంతేగాదు ఈసారి ఎన్నికల్లో తన కుమారుడిని గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాగుంట శ్రీనివాసులు బర్త్ డే సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోగా జగన్ అనుమతితోనే ఆయన ఈ కామెంట్స్ చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మాగుంట తనయుడు పోటి చేయడం వరకు ఓకే కానీ శ్రీనివాసులు పోటీ చేస్తారా..ఒక వేళ చేస్తే ఏ స్ధానం నుండి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -