Tuesday, April 30, 2024
- Advertisement -

పవన్‌ బాటలోనే లోకేష్‌?

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇక ఎన్నికల రేసులో వైసీపీ ముందంజలో ఉండగా టీడీపీ – జనసేన నేతలు కాస్త వెనుబడే ఉన్నారు. ప్రధానంగా ఇరు పార్టీల మధ్య సీట్ల సంఖ్య, ఏయే స్థానాల్లో పోటీ అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అయితే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది పక్కన పెడితే పవన్ మాత్రం రెండు స్థానాల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇదే బాటలో నారా లోకేష్‌ కూడా రెండు స్థానాల్లో పోటీ చేయనున్నారనే టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్. ఈసారి కూడా మంగళగిరి నుండే పోటీ చేయనుండగా దీంతో పాటు మరో స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు సైతం ఇదే ప్రతిపాదించగా చినబాబు సిద్ధంగానే ఉండగా చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇక పవన్ గత ఎన్నికల్లో గాజువాక,భీమవరం రెండు స్థానాల నుండి పోటీచేయగా రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి భీమవరంతో పాటు మరో స్థానంలో బరిలోకి దిగుతారని తెలుస్తోండగా త్వరలోనే ఇందుకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -