Sunday, May 5, 2024
- Advertisement -

ఆర్జీవీ వ్యూహంకు బ్రేక్

- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేయడంతోనే వివాదానికి ఆజ్యం పడగా ట్రైలర్,టీజర్,సెన్సార్ ఇలా ప్రతీది కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రసే. అన్ని సమస్యలను దాటుకుని సెన్సార్ పూర్తి చేసుకుని ఇవాళ విడుదల కావాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.

టీడీపీ నేత నారా లోకేష్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సీబీఎఫ్‌సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను 2024 జనవరి 11 వరకు సస్పెన్షన్‌లో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు.

పార్టీ జెండాలు, నేతల పేర్లతో చిత్రం తీశారని, ఇది పలు పార్టీల నేతల పరువు నష్టం కలిగించేదిగా ఉందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది మురళీధర్‌రావు వాదించారు. నిర్మాత-దర్శకుడి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిట్ పిటిషన్ మెయింటెనబుల్ కాదు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని సెక‌్షన్‌ 29(ఏ) ప్రకారం ఈ పిటిషన్‌ వేసే అర్హత పిటిషనర్‌కు లేదని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 11 వరకు సస్పెన్షన్ లో ఉంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -