Tuesday, May 21, 2024
- Advertisement -

టీడీపీ..’ట్రిపుల్ బీ’ పాలసీ వర్కవుట్ అవుతుందా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, జైలు పాలవ్వడంతో రంగంలోకి దిగారు కుటుంబసభ్యులు. పార్టీని వేరే వారి చేతుల్లోకి వెళ్లకుండా అంతా తామై వ్యవహారిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బాలకృష్ణ..చంద్రబాబు కుర్చిలో కూర్చోని తానే బాస్ అని పరోక్షంగా చెప్పేశారు. ఇక ఇప్పుడు బాబు కుటుంబ సభ్యుల వంతు వచ్చేసింది. అంటే ప్లాన్ బీ అన్నమాట. ఒకవేళ లోకేష్ అందుబాటులో లేకపోతే అంటే అవినీతి కేసుల్లో లోకేష్ పాత్ర ఉందంటూ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో చినబాబును కూడా అరెస్ట్ చేస్తే పార్టీ నేతలు నిరాశ పడకుండా తామున్నమనే భరోసా నింపేలా ప్లాన్ చేస్తున్నారు.

అదే ‘ట్రిపుల్ బీ’ పాలసీ. B-బాలకృష్ణ, B-బ్రహ్మాణి,B-భువనేశ్వరి. ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు టీడీపీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారని టాక్. అంతేగాదు పార్టీలో ట్రబుల్ షూటర్లుగా మారి ఎంత క్లిష్ట పరిస్థితినైనా చక్కదిద్దేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఎందుకంటే ఇప్పట్లో చంద్రబాబుకు బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక అవినీతి కేసుల్లో పలువురు టీడీపీ కీలక నేతలు కూడా ఉన్నారు. లోకేష్‌తో పాటు అచ్చెన్నాయుడుని త్వరలోనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని భావిస్తోంది టీడీపీ నాయకత్వం. ప్లాన్‌లో ఏలో భాగంగా ఇప్పటికే జనసేనతో జట్టు కట్టగా దీనికి తోడు ప్లాన్ బీని కూడా అమలు చేయాలని భావిస్తోంది.ఇందులో భాగంగా తొలిసారి టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు చంద్రబాబు భార్య భువనేశ్వరి. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల వైపు కన్నెత్తికూడా చూడని ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. ఇక బ్రహ్మాణి సైతం తన వంతు పాత్రను పోషించేందుకు సిద్ధమవుతుండగా అల్రెడీ రంగంలోకి దిగిపోయారు బాలయ్య.

చంద్రబాబు అరెస్ట్ సింపతిని క్యాచ్ చేసుకోవడంతో పాటు కార్యకర్తలకు తామున్నమనే భరోసా ఇచ్చేందుకు ముగ్గురు వేర్వేరుగా జనంలోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా బాలకృష్ణ ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించగా భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి లేదా వేర్వేరుగా పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాలను నేతల నుండి సేకరిస్తున్నారు. మొత్తంగా ఈ ముగ్గురు ఒకేసారి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడితే టీడీపీకి కాస్త కలిసివచ్చే అంశమే అయినా జగన్ ఎత్తుగడల ముందు టీడీపీ ప్లాన్స్ వర్కవుట్ అవుతాయో లేదో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -