Monday, May 20, 2024
- Advertisement -

మళ్లీ చంద్రబాబుకు నిరాశే..

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన న్యాయస్థానం ఆయన పిటిషన్‌ని తిరస్కరించింది. బెయిల్‌తో పాటు మధ్యంతర పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు విని సెప్టెంబర్ 19న తదుపరి వాదనలు విననున్నట్లు తెలిపింది.

మధ్యంతర బెయిల్‌తో పాటు జనరల్ బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేశారు బాబు తరపు న్యాయవాదులు. ప్రాథమిక సాక్ష్యాలతో అరెస్ట్ చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని..అసలు పిటీషన్ కు అర్హత ఉందా..? లేదా..? అనే విషయంపై విచారణ జరపాలని కోరారు సీబీఐ తరపు న్యాయవాది కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవొచ్చని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. కానీ బెయిల్ పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది కోర్టు.

దీంతో బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు నిరాశే మిగిలింది. ఇక ఏసీబీ కోర్టు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలన్న పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుండగా ఒకవేళ రిమాండ్‌కు అప్పగిస్తే మరిన్ని రోజులు బాబు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. ఇక నారా భువనేశ్వరి మరోసారి చంద్రబాబుతో ములాఖత్ కు దరఖాస్తు చేసుకోగా జైలు అధికారులు నిరాకరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -