Friday, May 3, 2024
- Advertisement -

విలన్లకు హీరోలు బచ్చాగానే కనిపిస్తారు..జగన్ ఫైర్!

- Advertisement -

విలన్లకు హీరోలు బచ్చాగానే కనిపిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబుకు చురకలు అంటించారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా చింతపాలెంలో మాట్లాడిన జగన్…తనను చంద్రబాబు బచ్చా అనడంపై చురకలు అంటించారు. తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నిన్ను ఏమనాలి అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు ఉక్రోశం, కడుపు మంటతో నా మీద రాళ్లు వేయమంటున్నాడు…రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆయనకు అధికారం కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు, సుబాహుడు, హనుమంతున్ని బచ్చా అనుకున్న రావణుడిలా నాకు కూటమి నేతలు కనిపిస్తున్నారు అంటు మండిపడ్డారు.

తాను ఒక్కడినే ఒంటరిగా వస్తున్నా కానీ చంద్రబాబు మాత్రం పదిమందితో వస్తున్నాడని నిలదీశారు జగన్. సింగిల్ గా వస్తోన్న తనను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఈ ఎన్నికలు పేదలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వా తాతల, పేద సామాజికవర్గాల వారి ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కాబట్టి అబద్దపు హామీలకు మోసపోవద్దన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని అంతా ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -