Saturday, May 3, 2025
- Advertisement -

పవన్ మాదిరే..కేఏ పాల్ బంపర్ ఆఫర్!

- Advertisement -

దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లు…ఆయా పార్టీల్లో సీట్లు రాని వారికి జనసేన,కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలే దిక్కు కానున్నాయి. ఇక ఇప్పటికే జనసేనాని పవన్ పరిస్థితి అలానే తయారైంది. తన పార్టీ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోయినా చక్రం తిప్పుతానంటూ తొడలు కొడుతున్న ఫైనల్‌గా అభ్యర్థుల కోసం ఇతర పార్టీల నేతలపై ఆధారపడాల్సిన పరిస్థితే. అయితే ఇది అన్ని నియోజకవర్గాల్లో అని చెప్పలేం కానీ కొన్ని స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా పవన్ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. దీనికి ఉదాహరణే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు. తెలంగాణలో 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా అందులో ఇద్దరికి బీజేపీ వాళ్లకే సీట్లు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఇక ఏపీ సంగతి చెప్పనక్కర్లేదు.

ఇక కేఏ పాల్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రజాశాంతి పార్టీకి ఒక్క పాల్ తప్ప వేరే ఎవరి పేరు చెప్పలేని పరిస్థితి. ఇక ఆయన ఎక్కడ పోటీ చేసినా ఓటమే..డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ పైకి మాత్రం అధికారం తనదేనని పొలిటికల్ కామెడీ చేయడంలో దిట్ట.

తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని పరిశీలిస్తే..తాను తెలంగాణ సీఎం కాబోతున్నానని, ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని వారు ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు.తనకు 60శాతం ప్రజల మద్దతు ఉందని.. ఇప్పటికే 18మంది అభ్యర్ధుల్ని ప్రకటించాం, మిగతా 101మందిని రేపు ప్రకటిస్తానని చెప్పారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివాళ్లు ప్రజాశాంతి పార్టీలో చేరండి…తాను ఎమ్మెల్యేలుగా చేస్తా అంటూ పెద్ద కామెడీ చేశారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్‌లో పవన్‌ – కేఏ పాల్ గురించే ప్రధాన చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -