- Advertisement -

ఇక్కడకు రావద్దు.. విజయ్ కు డీకే శివకుమార్ విజ్ఞప్తి.. ‘జననాయగన్’ నిలిపివేత

- Advertisement -

కావేరి నదీ జలాల పంపిణీ అంశం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి తీవ్ర రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వివాదం పైన చర్చించేందుకు కర్ణాటక వస్తానని సీఎం విజయ్ చెప్పారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రావటం సరికాదని కర్ణాటక సీఎం డీకే శివ కుమార్ సూచించారు. కాగా.. ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ సినిమా జననాయగన్ కర్ణాటకలో నిలిపివేసారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

కావేరీ నదీ జలాల వివాదం మరోసారి కర్ణాటక- తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
రోజువారీగా తమిళనాడుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ కావేరి జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాలు జారీ చేయడంతో కర్ణాటకవ్యాప్తంగా కన్నడ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తో జరగాల్సిన ప్రతిపాదిత భేటీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయని తెలిపారు:

తమ ఆహ్వానం మేరకే తమిళనాడు సీఎం విజయ్ ఆగస్టు 3న బెంగళూరు రావాల్సి ఉందని వివరించారు. అయితే అథారిటీ తాజా ఉత్తర్వుల వల్ల క్షేత్రస్థాయిలో ఉద్వేగాలు నెలకున్నాయని చెప్పిన ముఖ్యమంత్రి… ఇటువంటి ఉద్రిక్త సమయాంలో విజయ్ ఇక్కడికి వస్తే నిరసనలు, ఆందోళనలు రేగడమే కాకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. న్యాయపరమైన చిక్కులు ముగిశాక, ప్రశాంత వాతావరణంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమవుతామని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ను ముందస్తు జాగ్రత్త చర్యగా కర్ణాటక చలనచిత్ర మండలి సూచనల మేరకు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు గాను బెంగళూరులోని శ్రీరాంపుర మరియు తమిళ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -