- Advertisement -
బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. మీడియా సమావేశం తర్వాత చిట్‌చాట్‌గా మాట్లాడిన కవిత.. కేసీఆర్ కు నేను రాసిన లేఖను లీక్ చేసింది సంతోష్ రావే అని ఆరోపించారు.
బిగ్ టీవీకి లేఖ అందించింది కూడా ఆయనే…. కాంగ్రెస్ నేతలకు కూడా సంతోష్ రావు నుంచే లేఖ వెళ్లింది అన్నారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తున్నారు అనేది మొత్తం సంతోష్ రావే లీక్ చేస్తున్నాడు… హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతిపై చాలాసార్లు కేసీఆర్ కు చెప్పాను అన్నారు.
ఎన్నో రోజులుగా ఈ ఇద్దరి గ్యాంగుల అరాచకాలతో పోరాడుతున్నాను… ఈ ఇద్దరు చేసిన అవినీతిపై నా దగ్గర చాలా సమాచారం ఉంది అన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై ఎమ్మెల్యే పల్లా నాకు సమాచారం ఇచ్చారు అన్నారు కల్వకుంట్ల కవిత.
