- Advertisement -

బీఆర్ఎస్‌లో హరీష్‌ రావే..కట్టప్ప!

- Advertisement -

మాజీ సీఎం కేసీఆర్ కూతురు , ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కవిత. రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు పంపారు కవిత.కేటీఆర్ ను బుజ్జగించి ,గడ్డం పట్టుకొని అడుగుతున్నా.. నాపై కుట్రలు జరుగుతుంటే ఒక అన్నగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మీరేం చేశారు ? చెప్పాలన్నారు.

అలాగే హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు పన్నాగాలు పన్నుతున్నారు… ఈరోజు నాకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరగొచ్చు అన్నారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న… కేసీఆర్, కేటీఆర్, నేను కలిసి ఉండకూడదని హరీష్ రావు కుట్రలు చేశారు అన్నారు.

హరీష్ రావు కట్టప్పలాంటోడు..కేసీఆర్, కేటీఆర్ ను ఓడించేందుకు కుట్ర చేశాడు, కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు ఇచ్చాడు అన్నారు. ఎన్నికల ఫలితాలు అటు ఇటు అయితే కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకునే ప్లాన్ వేశాడు… కేసీఆర్ హరితహారం అని పెడితే వందల కోట్ల రూపాయలు సంతోష్ రావు సంపాదించాడు అన్నారు. హరితహారం పేరుతో ప్రభాస్ గారిని, చిరంజీవి గారిని అనేక మంది హీరోలను మోసం చేశాడు సంతోష్ రావు.– కల్వకుంట్ల కవిత భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచించలేదు అన్నారు. సస్పెండ్ నోటీసు రావడంతో బాధపడ్డా అన్నారు.

నా లేఖ లీక్ చేసిన వ్యక్తులపై ఎందుకు విచారణ జరగలేదు?… పార్టీలో అంతర్గత స్వేచ్ఛ లేకపోతే ఎలా..?, కేసీఆర్, కేటీఆర్, నాది రక్త సంబంధం… పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పోయే బంధం కాదు అన్నారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేసినప్పుడే నా మీద, మా కుటుంబం మీద కుట్ర మొదలైంది… రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుని హరీష్ రావు బ్రతిమిలాడిన తర్వాతే ఇంత పెద్ద కుట్ర చేశారు..కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న రేవంత్‌.. హరీష్‌పై ఎందుకు చేయడం లేదు..?.. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్‌రావే కారణం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -