Wednesday, May 15, 2024
- Advertisement -

కొరకరాని కొయ్యలా ఎంపి కేశినేని..!

- Advertisement -

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారంతో టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన కేశినేని…కొంతకాలంగా టీడీపీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా రోజుకో స్టేట్ మెంట్ ఇస్తూ రచ్చ చేస్తున్నారు. అంతేగాదు టీడీపీ నేతలకే మైండ్ బ్లాంక్ అయ్యే విధంగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ ప్రకటిస్తూ నిద్రలేకుండా చేస్తున్నారు. ఇక ఇటీవల నారా లోకేష్ పాదయాత్రకు డుమ్మా కొట్టిన నాని..తాను లేకపోతే పార్టీనే లేదంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ అంటేనే గిట్టని నాని…ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుండటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఇటీవల విజయవాడలో చంద్రబాబు, లోకేష్‌ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కేశినేని…అధికార వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంటున్నారు. దీనంతటికి కారణం ఆయన వైసీపీలోకి వెళ్లెందుకేనని చెబుతుండగా ఆయన సన్నిహితులు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఇక నాని సైతం వైసీపీలో చేరుతారా అన్న దానిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు సైతం నానిపై విమర్శలు చేయడానికి సాహసించడం లేదు. అయితే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న టీడీపీ నేతలు ఏం జరుగుతుందో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఇక వైసీపీలో ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ తర్వాత పెద్దగా యాక్టివ్ రాజకీయాల్లో లేరు. విజయవాడ పార్లమెంట్ స్దానం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఖాళీగా ఉంది కాబట్టి, ఆయన వచ్చినా ఆశ్చర్యం లేదని వైసీపీ కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే నాని టీడీపీని టార్గెట్‌ చేయడానికి కారణం ఆయన తమ్ముడు కేశినేని చిన్ని వ్యవహారమేనట. తనకు వ్యతిరేకంగా సోదరుడు చిన్నిని బెజవాడ సీటుకు పోటీ తెచ్చారని రగిలిపోతున్న నాని పార్టీలో తన ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేలా అడుగులు వేస్తున్నారు. అందుకే కొంతకాలంగా సొంతపార్టీనే ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తున్నా తప్పుబట్టలేని స్థితిలో ఉన్నారు టీడీపీ నేతలు. నాని వ్యవహారంపై టీడీపీ అగ్రనేతలకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే నాని ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రతి స్పందించవద్దని కార్యకర్తలకు నేతలు సూచించారట. చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెబుతుండగా తెలుగు తమ్ముళ్లు మాత్రం అసంతప్తిలోనే ఉన్నారట. ఏదిఏమైనా ఇప్పుడు బెజవాడలో నాని మార్క్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -