Monday, April 29, 2024
- Advertisement -

ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగలనుందా?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఇక ముఖ్యంగా ఏపీలో వైసీపీ – టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఇక ఎన్నికల రేసులో ఇప్పటికే తమ పార్టీ నేతలకు కీలక సూచన చేసిన సీఎం జగన్‌…ప్రజల్లోనే అనునిత్యం ఉండాలని సూచించగా టీడీపీ సైతం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న అంశం దొరికినా రచ్చ చేయాలని భావిస్తోంది. ఇక ఎన్నికల సమరం అనగానే జంపింగ్ జపాంగ్‌లు అంటే అటు నుండి ఇటు నుండి అటు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటుంది.

ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2018లో టికెట్ ఆశీంచిన ఆమెకు దక్కలేదు. జగన్ నిర్ణయంతో ఇప్పటివరకు పార్టీనే అంటిపెట్టుకుని వస్తున్నారు. అయితే ఈసారి ఎలాగైనా పోటీచేయాలని ఆమె భావిస్తున్న టికెట్ దక్కే అవకాశం కనిపించడం లేదు.

టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం పార్లమెంట్ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్న అక్కడ బలమైన నేతలే ఉన్నారు. ప్రస్తుతం టెక్కలి ఇంఛార్జీగా దువ్వాడ శ్రీను భార్య వాణి ఇంఛార్జీగా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ 2019లో వైసీపీ తరుపున శ్రీకాకుళం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఎంపీగా ప్రయత్నిద్దామని అనుకున్న శ్రీకాకుళం ఎంపీ సీటును తన అనుచరులకు ఇప్పించేందుకు ధర్మాన సోదరులు ప్రయత్నిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కృపారాణి పార్టీని వీడేందుకే సిద్ధమయరని ప్రచారం జరుగుతోంది.

కృపారాణికి ఇప్పటికే టీడీపీ నుండి ఆఫర్ కూడా వచ్చినట్లు ఆమె సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం శ్రీకాకులం ఎంపీగా ఉన్న రామ్మోహన్‌ని ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో ఆ సీటుని కృపారాణికి ఇవ్వనున్నారట. కృపారాణి చేరికతో జిల్లాలో ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్న కాళింగ సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవచ్చునని టీడీపీ అంచనా వేస్తోంది. 2009లో కాంగ్రెస్ నుండి గెలిచిన ఆమె కేంద్ర సహాయమంత్రిగా కూడా పనిచేశారు. ఒకవేళ కృపారాణి వైసీపీని వీడితే ఆ పార్టీకి కొంతమేర నష్టం జరగడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -