Friday, May 3, 2024
- Advertisement -

ఫేక్ ఓటర్ల అంశం…బండిని ఏసుకున్న నాని!

- Advertisement -

బండి సంజయ్…ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక రకంగా తన మాటలతోనో, చేతలతోనో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. చెప్పే విషయాలపై ఎలాంటి స్పష్టత లేకుండా విమర్శలు గుప్పించడం బండి సంజయ్ కే చెల్లిందేమో. మసీదులు కూల్చుదాం సమాధులు తవ్వుదాం అంటూ ఏ స్థాయిలో మత విద్వేషాలకు తవిచ్చారో అందరికీ తెలిసిందే. అంతేగాదు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ పెద్దల కాళ్ళ వద్ద ఉంచుతూ వారి కాళ్ళకు చెప్పులు వేయడం వంటి పరిణామలు గమనిస్తే.. బండి సంజయ్ పై బీజేపీ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తుంటారు.

ఇక ఆయన నోటి ధూల ఫలితం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపోయింది. ఇక జాతీయ కార్యదర్శిగా ఏపీలో అడుగుపెట్టారు సంజయ్. అక్కడ అవే మాటలు. దీంతో సంజయ్‌పై అక్కడ ట్రోలింగ్ మొదలైంది. తాజాగా ఏపీలో ఫేక్ ఓటర్ల అంశంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు సంజయ్. ప్రతి నియోజకవర్గంలో 10 నుండి 20 వేల దొంగ ఓట్లను చేర్చుతున్నారంటూ ఆరోపించగా వైసీపీ నేతలు అంతేస్ధాయిలో ఘాటుగా స్పందిస్తున్నారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల కమిషన్ ని కలిసిన అనంతరం బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో స్పందించారు పేర్ని నాని. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతాపార్టీ చేసినట్లు అందరూ చేస్తారనుకుంటే పొరపాటని ఇది బీజేపీ కాదు వైసీపీ అంటే ఎద్దేవా చేశారు. అంతేగాదు పక్క రాష్ట్రంలో పదవి పోయినవాడు ఒకడు వచ్చి ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై మాట్లాడుతున్నాడు అంటూ చురకలు అంటించాడు. ఇలా ఏదిబడితే అది మాట్లాడినందుకే ఎన్నికల వేళ పదవి ఊడిపోయిందని మండిపడ్డారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ ప్రజల చేత చివాట్లు తిన్న సంజయ్‌ పద్దతి మార్చుకోకపోతే ఏపీ ప్రజల చేత కూడా అలాంటి పరిస్థితే రావొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -