Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్..కేశినేని శ్వేత రాజీనామా!

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని త్వరలోనే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించగా ఆయన బాటలోనే కూతురు శ్వేత నడించేందుకు సిద్ధమైంది. టీడీపీతో పాటు విజయవాడ కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేయనున్నారని ప్రకటించారు నాని. కార్పొరేటర్‌గా శ్వేత రాజీనామాను ఆమోదించిన వెంటనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి శ్వేత రాజీనామా చేస్తారని నాని ప్రకటించారు. శ్వేత విజయవాడ 11వ డివిజన్ కార్పోరేటర్ గా కొనసాగుతున్నారు.

విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలతోనే నాని పార్టీ వీడనున్నారు. ప్రధానంగా చంద్రబాబు వైఖరి కూడా కారణం. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న నానిని కాదని ఆయన తమ్ముడు చిన్నిని చంద్రబాబు ప్రొత్సహించడమే అసలు వివాదానికి కారణం.

గత మున్సిపల్ ఎన్నికల్లో తన కూతురు శ్వేతను మేయర్ చేయాలని నాని భావించారు. శ్వేతను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని టిడిపి అధినేత చంద్రబాబును కోరగా ఆయన పట్టించుకోలేదు. అప్పటి నుండే వివాదానికి వివాదానికి ఆజ్యం పడగా తన తమ్ముడు చిన్ని ఎంట్రీతో ఇది తారాస్థాయికి చేరింది. ఇక నాని వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -