Thursday, May 2, 2024
- Advertisement -

కేసీఆర్ ఈజ్‌ బ్యాక్ సూన్!

- Advertisement -

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండగా కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఇంఛార్జీలను ప్రకటించి మరింత హీట్ పెంచేసింది. ఇక ప్రధానంగా బీఆర్ఎస్ వ్యూహాం ఏంటీ? మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడు బయటకొస్తారు అన్నదానిపై చర్చ జరుగుతోంది.

అయితే పార్టీ ముఖ్యనేతల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో గులాబీ బాస్ ఈజ్ బ్యాక్ అనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ అనుకున్నదానికంటే త్వరగా కోలుకుంటుండటంతో త్వరలోనే ఆయన ప్రజల్లోకి వస్తారని నేతలు స్పష్టం చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తున్నారు గులాబీ బాస్. గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వారిలో ముఖ్యులను బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్, కేటీఆర్ కూడా ఎంపీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్ గిరి స్థానం నుండి కేటీఆర్,మెదక్ నుండి కేసీఆర్, కరీంనగర్ నుండి వినోద్ కుమార్‌ని బరిలోకి దించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాలకు సైతం బలమైన అభ్యర్థుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా రానున్నపార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి కీలకం. ఈ ఎన్నికల్లో సత్తాచాటకుంటే నాయకుల్లో ధైర్యం నింపే వారుండరూ. అందుకే గులాబీ సెంటిమెంట్‌ని మరింత రగిల్చి ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచేలా ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. మొత్తంగా త్వరలో బయటకు రానున్న గులాబీ బాస్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? పార్టీని తిరిగి ఎలా గాడిన పెడతారోనని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -