Saturday, May 4, 2024
- Advertisement -

పవన్‌కు షాక్‌ల మీద షాక్‌..

- Advertisement -

పవన్ ఒంటెద్దు పోకడలతో జనసేనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా జనసేనను వీడుతున్నారు నేతలు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజీనామా చేయగా తాజాగా నెల్లూరు జిల్లా వంతు వచ్చేసింది. పార్టీ సీనియర్ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేనకు రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను జనసేన కార్యలయానికి పంపించారు. పవన్ ప్రసంగాలతో ఆకర్షితుడినై జనసేనలో చేరానని.. నెల్లూరు సిటీలో తన పనిని గుర్తించిన పవన్ 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఓడిననా తాను ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని అయితే అంతర్గతంగా తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు.

తాను ప్రస్తుత పరిస్థితుల్లో అవమానాలను భరిస్తూ ఉండలేనని, తన ఓర్పు, సహనం నశించిందని చెప్పారు. అన్ని కోణాల్లోనూ అలోచించి, తనతో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. టీడీపీతో పొత్తు నేపథ్యంలో వినోద్ రెడ్డి సీటుకు ఎసరు వచ్చింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ పోటీ చేసే అవకాశం ఉండటంతో వినోద్ రెడ్డి పార్టీని వీడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -