Monday, May 6, 2024
- Advertisement -

వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్!

- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ వరుణ్ తేజ్ వివాహం హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జరగనున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరుగగా నవంబర్ 1న ఇటలీలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా వరుణ్ – లావణ్య పెళ్లి డేట్‌పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా వేదిక మాత్రం ఇటలీలోని టుస్కానీ వద్ద నున్న బోర్గో శాన్ ఫెలోస్ రిసార్ట్ లో జరగనుందని తెలుస్తోంది.

ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కుటుంబాలతో పాటు పరిమితంగానే అతిథులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత నెల రోజుల పాటు హనీమూన్‌ని ఎంజాయ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 9న హైదరాబాద్ లో లావణ్య – వరుణ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -