- Advertisement -

బంగ్లాలో అల్లర్లు..ముస్తాఫిజుర్‌ పై వేటు

- Advertisement -

బంగ్లాదేశ్‌ పేస్‌ బౌలర్‌ ముస్తాఫిజూర్ రహ్మాన్‌కు ఐపీఎల్‌ వేదికగా పెద్ద షాక్ తగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టు ముస్తాఫిజూర్‌ను తమ స్క్వాడ్‌ నుంచి విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులే కారణమని తెలుస్తోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో బీసీసీఐ జోక్యం చేసుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజూర్‌కు రూ.9.20 కోట్ల భారీ ధర పలికింది. బంగ్లాదేశ్ నుంచి ఈ ఏడాది ఐపీఎల్‌కు ఎంపికైన ఏకైక ఆటగాడు కూడా ఆయనే కావడం గమనార్హం. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌గా తన వెరైటీ కట్టర్లతో గుర్తింపు పొందిన ముస్తాఫిజూర్, గతంలో పలువురు ఐపీఎల్ జట్లకు కీలక విజయాలు అందించాడు.

అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముస్తాఫిజూర్‌ను విడుదల చేసినప్పటికీ, అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం కేకేఆర్‌కు కల్పించనున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రీడా పరమైన అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా ఐపీఎల్‌పై ప్రభావం చూపుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -