రెడ్డిల డామినేషన్ ఎక్కువగా ఉండే లోక్ సభ నియోజకవర్గం కర్నూల్. గత రెండు ఎన్నికల్లో వైసీపీనే జెండగా ఎగురవేయగా ఈసారి కూడా గెలుపుబాట పట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది వైసీపీ. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కర్నూల్ పార్లమెంట్ నుండి ఇద్దరు బీసీ నేతలే తలపడుతున్నారు.
ఇక కర్నూల్‌లో కోట్ల ,కేఈ ఫ్యామిలీల ఆధిపత్యం ఎక్కువ. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు కోట్ల సూర్యప్రకాశ్ ఎక్కువసార్లు ఇక్కడి నుండి గెలుపొందారు. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీ అభ్యర్థులదే విజయం. గత రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయడు పోటీ చేయగా వైసీపీ చేతిలో ఓడిపోయారు.
ఈసారి ఎన్నికల్లో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను పోటీలోకి దింపాలని భావించారు జగన్. కానీ ఆయన పోటీకి విముఖత చూపించడంతో కర్నూలు మేయర్ బీవై రామయ్యకు చాన్స్ దక్కగా గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ తరపున కురవ సామాజికవర్గానికి చెందిన పంచలింగాల నాగరాజు పోటీ చేస్తున్నారు. ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న నాగరాజుకు ఎంపీ టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇక కర్నూల్‌లో గత 40 ఏళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించగా గెలుపు కోసం టీడీపీ అభ్యర్థి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ సారి కూడా ప్రజలు వైసీపీకే పట్టం కడతారనడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.
