Saturday, May 4, 2024
- Advertisement -

రేసులో లేని బీజేపీ..వైసీపీకే లాభం!

- Advertisement -

ఏపీలో కూటమిగా టీడీపీ – జనసేన – బీజేపీ వస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు వైసీపీ అధినేత జగన్, మరోవైపు పవన్,చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీ నామమాత్రమే అనుకుంటున్న కాంగ్రెస్ సైతం ప్రచరంలో వేగం పెంచగా బీజేపీలో మాత్రం చలనం లేదు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అడపదపడ ప్రెస్‌మీట్‌లు తప్ప ప్రజాక్షేత్రంలో పెద్దగా వెళ్లింది లేదు. గత ఎన్నికల్లో బీజేపీ ఒకటిన్నర శాతం ఓట్లు రాగా పొత్తులో మాత్రం 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. అయితే ప్రచారంలో ఈ స్థానాల్లో వెనుకబడటంతో అధికార వైసీపీకే ఇది లాభం చేకూర్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా బీజేపీ కనీసం ఖాతా అయినా తెరుస్తుందా అన్న సందేహాం ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతోంది.కేవలం వైసీపీని ఓడించే ప్రాతిపదికనే ఈ మూడు పార్టీలు జట్టు కట్టగా ప్రజల నుండి అంత అమోదం లభించడం లేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా చిలకలూరి పేటలో బాబు, పవన్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు ప్రధాని మోడీ. ఆ సభ ఫెయిల్ కావడం, ఆ తర్వాత మూడు పార్టీల కార్యాచరణ లేకపోవడం మైనస్ అనే చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -