- Advertisement -
అబ్ కి బార్ మోడీ సర్కార్, టార్గెట్ 400 దిశగా బీజేపీ విస్తృత ప్రచారం చేస్తోంది.ఇక ఈసారి కూడా బీజేపీ గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దానిపై ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని ఆ పార్టీ నేతలే స్వయంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది.
బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధానమంత్రి కావడం ఖాయమని కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన నేతలకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఎలాంటి పదవులు ఇవ్వరాదన్నది బీజేపీ ప్రధాన సిద్ధాంతం. ఈ నిబంధనను తీసుకొచ్చింది నరేంద్రమోడీయే.
దీని ప్రకారమే సీనియర్లను పార్టీకి దూరం చేశారు మోడీ. కాబట్టి షానే ఈసారి పీఎం అనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలు పూర్తయితే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
