Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణ సీఎంపై ఖర్గే సంచలనం..వారికి షాకే!

- Advertisement -

అంతా ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చి కోసం తన్నులాట తప్పదని భావించగా సరిగ్గా అలానే జరిగింది. సీఎం సీటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దక్కకుండా సీనియర్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్‌ను సీఎం చేస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పగా చేసేదేమీ లేక సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యత అధిష్టానానికి అప్పజెప్పారు.

ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇవాళ సాయంత్రం లోపు సీఎం ఎవరనేది ప్రకటిస్తామి క్లారిటీ ఇచ్చేశారు. ఇక మరోవైపు సీఎం రేసులో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నారు.

ఒక హోటల్ ఎల్లాలో జరిగిన ఏఐసీసీ పరిశీలకుల సమావేశంలో సీఎంగా రేవంత్ రెడ్డికి మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కావడంతో కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరి పేరును ఫైనల్ చేస్తారోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది. అయితే ఈ నెల 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారంతో పాటు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -