Sunday, May 5, 2024
- Advertisement -

సలార్ సెకండ్ ట్రైలర్‌!

- Advertisement -

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సలార్. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ రాబట్టింది.

యాక్షన్ ప్యాక్‌డ్, థ్రిల్లింగ్, మాస్ అంశాల కలయికగా ఉన్న ట్రైలర్‌ అందరిని ఆకట్టుకోగా పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, జగపతి బాబు, బాబీ సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా త్వరలోనే ఫ్యాన్స్ కోసం సెకండ్ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు.

స్నేహితుల అనుబంధంతో సెకండ్ ట్రైలర్ ఉండనుందట. ప్రభాస్ – శృతి మధ్య రొమాంటిక్ సీన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయట. సినిమా విడుదలకు ఇంకా 15 రోజులకు పైగా సమయం ఉండగా ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. భారీ అంచనాల మధ్య వస్తున్న సలార్‌ ఏ స్థాయి హిట్ ను అందుకుంటుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -