- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై స్పష్టత!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యం బాగాలేదని….త్వరలోనే రాజీనామా చేయనున్నారని సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది.

ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా స్పందించారు. నా జీవితంలో ఎప్పుడూ లేనంత బాగున్నాను. అదీకాక, డీసీ ఇప్పుడు క్రైమ్-ఫ్రీ జోన్ అని పోస్ట్ చేశారు.

అలాగే మీడియాపై విరుచుకుపడుతూ..జో బైడెన్ పలుమార్లు వరుసగా పబ్లిక్‌లో కనిపించకపోయినా మీడియా ఆయనను ‘sharp’, ‘top of his game’ అంటుంది. కానీ వాస్తవంగా ఆయన డైపర్లు వేసుకుని నిద్రపోతూ గడిపేవాడు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ పబ్లిక్ వర్క్ అవర్స్ చేసిన అధ్యక్షుడిగా నేను ఉన్నాను. కానీ నేను 24 గంటలు కనిపించకపోతే మీడియా అల్లకల్లోలమవుతుంది. ఇది హాస్యాస్పదమైన డబుల్ స్టాండర్డ్ అని పేర్కొన్నారు.

ఆగస్టు 26న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ట్రంప్ చివరిసారిగా ప్రజల ముందుకు వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -