మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.
కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో పాటు, చిరంజీవిని కొత్త కోణంలో చూపించబోతున్నాడనే వార్తలు సినిమాపై మరింత హైప్‌ను పెంచుతున్నాయి. అనిల్ రావిపూడి తన ప్రత్యేకమైన వినోదాత్మక శైలిలో, భావోద్వేగాలు మరియు హాస్యాన్ని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. చిరంజీవి పాత్ర పేరు శంకరవరప్రసాద్ కావడంతో, సినిమా టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పండుగ సీజన్ కావడంతో థియేటర్లలో సందడి ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిల్ రావిపూడి టచ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.
