Friday, May 17, 2024
- Advertisement -

వైసీపీలోకి ముద్రగడ

- Advertisement -

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. తాడేపల్లిలోని క్యాంపు కార్యలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముద్రగడ..వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని, రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.పార్టీ అన్ని రకాలుగా రాజకీయంగా అండదండలుగా ఉంటుందని జగన్ ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ముద్రగడ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కొంతకాలంగా పెద్ద చర్చ జరిగింది. తొలుత టీడీపీ, తర్వాత జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు,ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు ముద్రగడతో జరిపిన చర్చలు ఫలించడంతో వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

ముద్రగడ ఎంట్రీతో ఏపీ పొలిటికల్ ముఖ చిత్రం మారిపోనుంది. ముఖ్యంగా కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఎన్న పీఠాపురం నుండి పవన్ పోటీ చేస్తుండగా అక్కడ ముద్రగడ తన మార్క్ చూపించి పవన్ ఓటమికి పనిచేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -