Sunday, April 28, 2024
- Advertisement -

చర్యకు ప్రతిచర్య తప్పదు..టీడీపీకి నాగబాబు హెచ్చరిక!

- Advertisement -

టీడీపీ – జనసేన మధ్య సీట పంపకం ఇరు పార్టీల పొత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చంద్రబాబు ఒంటెద్దు పొకడలకు తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు జనసేనాని పవన్. టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించగా పవన్ సైతం జనసేన పోటీచేసే రెండు స్థానాలు ఇవేనంటూ ప్రకటన విడుదల చేశారు. అంతేగాదు చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పవన్‌ను బుజ్జగించే పనిలో పడగా అంతలోనే మెగాబ్రదర్ నాగబాబు మరో బాంబ్ పేల్చారు.

కొన్ని నిబంధనలు కొన్నిసార్లు గుర్తుచేసుకోవాలంటూ న్యూటన్స్ నియమాలతో కూడిన పోస్ట్ చేశారు నాగబాబు. చర్యలకు ప్రతిచర్య ఉంటుందని అర్థం వచ్చేలా … తాను పెట్టే ప్రతీపోస్టుకు అర్థం ఉంటుందని అనుకోవద్దని సెటైర్ వేశారు. కొన్నిసార్లు సమాచారం మాత్రమే పోస్టు చేస్తానని, ఇప్పుడు ఫిజిక్స్ లాస్ పెట్టానని తెలిపారు. రేపు మరికొన్ని పోస్టులు కూడా చేస్తానని నాగబాబు అన్నారు. ఇక నాగబాబు చేసిన ట్వీట్ టీడీపీకి, చంద్రబాబుకు హెచ్చరిక లాంటిదేనని అందరికి అర్ధమవుతోంది.

ఒకవేళ చంద్రబాబు తన విధానాలతో ముందుకు వెళ్తే తాము కూడా తమ దారి చూసుకోవాల్సి వస్తుందని నాగబాబు పరోక్షంగా హెచ్చరించారని తెలుస్తోంది. పొత్తు ధర్మం పాటించకుండా ముందుకెళ్తే అందుకు ప్రతిచర్య కూడా ఉంటుందని మెగాబ్రదర్ చేసిన ట్వీట్‌కు అర్థహని జనసేన నేతలు వాపోతున్నారు. ఇక సీట్ల పంపకం విషయంలో టీడీపీ తగ్గకపోతే పవన్ తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అవసరమైతే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట పవన్. మొత్తంగా టీడీపీ – జనసేన మధ్య వచ్చిన గ్యాప్ మాత్రం ఇరు పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -