Saturday, May 18, 2024
- Advertisement -

జగన్ సెంటిమెంట్..టీడీపీ పని ఖతం!

- Advertisement -

విశాఖ జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం జగన్. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దగ్గరి నుండి మేనిఫెస్టో రూపకల్పన వరకు తనదైన శైలీలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్. ఇక ఇవాళ జరిగే వైసీపీ సిద్ధం సభలో జగన్ కార్యకర్తలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనున్నారు.

అయితే జగన్‌ ఉత్తరాంధ్ర నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం వెనుక సెంటిమెంట్ ఉంది. 2019లో ఉత్తరాంధ్ర నుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో జగన్ గాలి ముందు టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. చరిత్రలో కనివిని విని ఎరుగని విధంగా ఓటమిని మూటగట్టుకుంది. అందుకే ఈ సారి కూడా ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు జగన్.

ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, విజయనగరం , శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ కేడర్ ఈ సభకు హాజరుకానున్నారు. దాదాపు మూడు లక్షల మైంది వైసీపీ కార్యకర్తలు ఈ సభకు వస్తారని అంచనా. ఇప్పటికే వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఇప్పటికే నాలుగు జాబితాల్లో 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ అభ్యర్థులను మార్చగా త్వరలోనే ఐదో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి వైనాట్ 175 పేరుతో దూసుకుపోతున్న జగన్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చేందుకు తన ముందున్న అస్త్రాలు అన్నింటిని పరిశీలిస్తున్నారు. ఏదిఏమైనా ‘సిద్దం’ సభలతో కేడర్‌కు తన విధానాన్ని వివరించనున్నారు జగన్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -