Tuesday, April 30, 2024
- Advertisement -

ఒక్క విజయం కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు వీళ్ళే!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ ప్రతి సినిమా హిట్ కొట్టాలంటే అది ఎంతో అసాధ్యమైన పని. వారు నటించిన సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీలో వారికి తిరుగుండదు. అదే తరచూ ఫ్లాపులను చూస్తే వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే వరుస ఫ్లాప్ లను చవిచూసిన హీరోలు ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

నాని: ఈ మధ్యకాలంలో నాచురల్ స్టార్ నానికి టైం కలిసిరాలేదని చెప్పవచ్చు. 2018 ముందు వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఆ తర్వాత వరుస ప్లాపులు ఎదురవుతున్నాయి. అయితే టక్ జగదీష్ సినిమా ద్వారా ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

అఖిల్: అక్కినేని వారసుడిగా అఖిల్ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా పై ఆశలు పెట్టుకున్నారు.

Also read:నాకు ఒక్క ఫోన్ చెయ్యండి.. శేఖర్ మాస్టర్ దాతృత్వం!

శర్వానంద్: శ్రీకారం సినిమా ద్వార శర్వానంద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోగా, ఈ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే మహాసముద్రం, ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ ఏడాది జనవరిలో అల్లుడు అదుర్స్ చిత్రం ద్వారా సందడి చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

నాగార్జున: కేవలం కుర్ర హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరో నాగార్జునకి కూడా చాలాకాలం నుంచి సరైన విజయాలు అందడం లేదు. తాజాగా విడుదలైన వైల్డ్ డాగ్ కూడా నిరాశపరిచింది.

Also read:స్టార్ అవ్వడం కోసం ఎంతైన కష్టపడొచ్చు..?

బాలకృష్ణ: నందమూరి నటసింహం బాలకృష్ణకి కూడా వరుస ఫ్లాపులే తగులుతున్నాయి.పైసా వసూల్, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, డిజాస్టర్ కాక ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -